నోట్లో పాము పెట్టుకుని వీడియో.. యువకుడు మృతి

52చూసినవారు
పాము నోట్లో పెట్టుకుని ఓ యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మెచి శివరాజులు, తండ్రి గంగారాం పాములను పడతూ జీవనం సాగిస్తారు. గంగారాం ఓ పామును పట్టి కొడుకుకి ఇచ్చాడు. నోట్లో పెట్టుకుని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని చెప్పాడు. తండ్రి చెప్పినట్లు శివరాజుల పామును నోట్లో పెట్టుకోగానే కాటేయడంతో యువకుడు మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్