కెనడాలోని టొరంటో ఎయిర్ పోర్టులో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి.గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. భద్రత సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.