జపాన్‌పై 1945లో అమెరికా వేసిన అణుబాంబులు భారీ విధ్వంసం కలిగించిన తర్వాత, 1946 నుంచి 1958 మధ్య కాలంలో USA పసిఫిక్‌లోని ‘బికినీ అటోల్’ అనే ద్వీపంలో 23 అణు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల తీవ్రతను చూపే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘కాసిల్ బ్రావో’ అనే హైడ్రోజన్ బాంబు హిరోషిమాపై వేసిన బాంబుతో పోలిస్తే 1000 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదిగా అందులో పేర్కొనడం గమనార్హం.