AP: ఫ్రీ ఫైర్ గేమ్ విషయంలో విద్యార్థులు రౌడీ షీటర్లుగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ రోడ్డులో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.