VIDEO:వరదలో కొట్టుకుపోయిన తల్లీబిడ్డ.. చివరికి

51చూసినవారు
ఉత్తరాఖండ్‌లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఈ క్రమంలో ఉధంసింగ్‌నగర్ ప్రాంతంలో ఓ తల్లీబిడ్డ ఇటీవల వరద నీటిలో కొట్టుకుపోయారు. అయితే ఆ మహిళ తన బిడ్డతో సహా ప్రాణాలు దక్కించుకునేందుకు చాలా కష్టపడింది. చివరికి కొందరు గ్రామస్తులు అతికష్టం మీద వరద నీటిలో చిక్కుకున్న ఆ తల్లీబిడ్డను కాపాడారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్