హోటళ్లు, రెస్టారెంట్‌లో ఏదైనా తిన్నాక దానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఓ రెస్టారెంట్‌లో కొందరు బిర్యానీ కడుపు నిండా తిన్నారు. తర్వాత రెస్టారెంట్ సిబ్బంది డబ్బులు చెల్లించాలని వారిని అడిగారు. దీంతో ఆ కస్టమర్లు గొడవ పడ్డారు. రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. ఇది పాకిస్థాన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. @gharkekalesh అనే X ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.