ఫెంగల్ తుఫాను కారణంగా చెన్నైలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విల్లుపురం జిల్లాలోని బీచ్లో ఇద్దరు ప్రేమికులు ఫొటోషూట్ ప్లాన్ చేసుకుని రెచ్చిపోయారు. వారిద్దరూ తుఫానును సైతం లెక్కచేయకుండా ముద్దుల పెట్టుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే, ప్రమాదాన్ని గుర్తించకుండా బారికేడ్ల వెంట నడుస్తూ ఫొటోలు దిగారు. వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.