సముద్ర తీరంలో స్నానం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అలల తీవ్రతకు సముద్రంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇదే కోవలో చెన్నైలోని మెరీనా బీచ్‌లో తాజాగా ఇద్దరు యువకులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. సముద్ర అల్లో చిక్కుకుని ప్రాణభయంతో ఆ యువకులు కేకలు పెట్టారు. రెస్క్యూ టీమ్ వెంటనే స్పందించి, వారిని కాపాడింది. సురక్షితంగా వారిని ఒడ్డుకు చేర్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.