VIDEO: చైన్ కోసం మహిళను ఈడ్చుకెళ్లారు!

62చూసినవారు
తమిళనాడులోని మధురైలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఈనెల 20న బైక్పై వచ్చిన నిందితులు ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాగడానికి ప్రయత్నించారు. గొలుసు లాగే క్రమంలో కిందపడిపోయిన ఆమెను అలాగే రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకెళ్లారు. దీంతో గొలుసు తెగి రెండు భాగాలైంది. ఒక భాగం బాధితురాలి వద్ద ఉండిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్