AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పద్మావతి అనే మహిళ కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా నెల రోజుల నుంచి స్థానికులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రౌడీలని పంపించి ఇంటిని గడ్డపారలతో ధ్వంసం చేశారని.. పోలీసులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని తనకు చావే శరణ్యమని తన మరణానికి అనుమతి ఇవ్వమంటూ అధికారులను కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.