అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో ఓ యువకుడు తన ప్రియురాలిని కోల్పోయాడని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. ప్రమాదం గురించి తెలిసి ప్రియుడు వెంటనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కి చేరుకున్నాడు. ప్రియురాలి బాడీ కోసం.. వెయిటింగ్ రూమ్‌లో ఏడుస్తూ కూర్చున్నాడు. ఎవరి కోసం వచ్చావని వీడియో తీసిన వాళ్లు అడిగితే.. ‘నా ప్రేమ’ కోసమంటూ సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా కన్నీటిపర్యంతమయ్యారు.