యూపీలోని మొరాదాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. కట్ఘర్ ప్రాంతంలో పట్టపగలు కాల్పులు జరపడం కలకలం రేపింది, ముగ్గురు దుండగలు బైకుపై వచ్చి ఒక యువతిపై కాల్పులు జరిపారు. సదరు అమ్మాయి తన తల్లి, సోదరుడితో కలిసి ఆటోలో ప్రయాణిస్తుండగా, దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.