డ్రగ్స్ టెస్ట్‌లో మస్తాన్ సాయికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో లావణ్య మరికొన్ని ఆధారాలు బయటపెట్టింది. మస్తాన్ సాయికి సంబంధించి మరికొన్ని వీడియోలను లావణ్య విడుదల చేసింది. మస్తాన్ ఇంటిలో జరిగిన డ్రగ్స్ పార్టీ వీడియో, ఫోటోలను విడుదల చేసింది. ఈ పార్టీలో అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.