TG: రాష్ట్రంలోని పేదలందరికీ సన్నబియ్యం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ జిల్లా, మండలస్థాయి నేతలతో మంత్రి ఉత్తమ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో సన్నబియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి చర్చించారు. సన్నబియ్యం సంబరాల్లో కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున పాల్గొనాలని ఉత్తమ్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లలోనూ పాల్గొని రైతులకు సహకరించాలన్నారు.