బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ప్రేయసి జాస్మిన్ ను సిద్ధార్థ్ వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని సిద్ధార్థ్ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించారు. ‘పెళ్లి వారం మొదలైంది’ అంటూ ప్రేయసితో దిగిన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.