అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. డీఎన్‌ఏ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విజయ్ రూపానీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా సీఎంఓ అధికారులు ఇప్పటికే సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు.