సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి!

79చూసినవారు
సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి!
AP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారని తెలిసింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఈ నెల 18న హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన రెండు రోజుల ముందుగానే విచారణకు హాజరయ్యారని సమాచారం. విజయవాడ సీపీ కార్యాలయంలో సిట్ అధికారులు విజయసాయిని విచారిస్తున్నారని తెలిసింది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారుతుందని సిట్ భావిస్తోంది.

సంబంధిత పోస్ట్