ముగ్గురు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం? (వీడియో)

51చూసినవారు
ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఇనాంగూడలో బుధవారం ఉదయం జరిగింది. బీఎన్.రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్ తన ముగ్గురు పిల్లలతో కారులో వెళ్తూ ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లాడు. గమనించిన స్థానికులు వెంటనే కారులో ఉన్న నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you