వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. దౌల్తాబాద్ పోలీసుల వివరాలు. బిచ్చాల్ కు చెందిన అశోక్(36), రేణుక దంపతులు. అదే గ్రామానికి చెందిన అనిల్ తో రేణుక వివాహేతర సంబంధం పెట్టుకున్నది. భర్త అడ్డు తప్పించాలనుకుంది. ప్లాన్ ప్రకారం ఈ నెల 12న ప్రియుడితో కలిసి భర్తను చంపి సహజ మరణంగా నమ్మించింది. రేణుక ప్రవర్తనపై అశోక్ సోదరుడి ఫిర్యాదుతో విషయం తెలిసిందన్నారు.