కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని గుండుమల్ మండలంలోని హన్మాన్ పల్లి గ్రామంలో శుక్రవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిన్న సమావేశం నిర్వహించి,నేడు గ్రామంలోని ఇంటింటికి తిరిగి పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న విద్య, వసతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం నర్సిములు, ఉపాధ్యాయులు నరేశ్, అనంతయ్య పాల్గొన్నారు.