బొంరస్ పేట తైబజార్ వేలంపాట రూ. 39, 000

68చూసినవారు
బొంరస్ పేట తైబజార్ వేలంపాట రూ. 39, 000
బొంరస్ పేట మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు కూరగాయల సంత 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను తైబజార్ వేలంపాట శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామానికి చెందిన రవి గౌడ్ అత్యధికంగా రూ. 39, 000 వేలం పాట పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మహేష్ కుమార్, డిప్యూటీ తాహసిల్దార్ రవి, కార్యదర్శులు వెంకటయ్య, రాజేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్