కొడంగల్ నియోజకవర్గ పరిధిలో మద్యం తాగిన మైకంలో అధిక మొత్తంలో జ్వరం టాబ్లెట్లు మింగి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం బొంరాస్ పేట మండలం మెట్లకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లెగడ్డ మల్లేష్ (32) తాగిన మైకంలో అధిక మొత్తంలో జ్వరం టాబ్లెట్లు వేసుకోవడం వల్ల చనిపోయాడు. ఈ మేరకు తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.