విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కోస్గి తహసిల్దార్ కార్యాలయం ముందు పిడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని, ప్రభుత్వ బడులు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.