కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోడంగల్ తాజా పరిణామాలను కేటీఆర్ కు వివరించినట్లు తెలిపారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఎలాంటి హోదా లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రోటోకాల్ పాటించడం లేదని పేర్కొన్నారు.