వికారాబాద్ జిల్లాలో గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి వెళ్తున్న అభ్యర్థి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన ధరూర్ మండలం దోర్నాల దగ్గర జరిగింది. బొంరాస్పేట్ మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు నెహ్రూ నాయక్ భార్య సుమిత్ర. వికారాబాద్లో గ్రూప్-1 పరీక్ష రాసి వస్తుండగా దోర్నాల వద్ద ప్రమాదం జరిగింది. సుమిత్ర స్వగ్రామం దేవుల నాయక్ తండాలో విషాదం నెలకొంది.