పరిగి: ఎస్సీ వర్గీకరణ అభినందనీయం

81చూసినవారు
పరిగి: ఎస్సీ వర్గీకరణ అభినందనీయం
పరిగి నియోజకవర్గం గండేడ్ మండలం సాలార్ నగర్ గ్రామంలో మందకృష్ణ మాదిగ, సీఎం రేవంత్ రెడ్డి, చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పి. నరసింహ రావు, బోరు కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్