వైద్యులు నిబద్ధతతో పని చేయాలి: కలెక్టర్

62చూసినవారు
వైద్యులు నిబద్ధతతో పని చేయాలి: కలెక్టర్
వైద్యులు సమయపాలన పాటిస్తూ నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు ఎంత మంది రోగులు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. వార్డులలో చికిత్సలు తీసుకుంటున్న రోగుల వద్దకు వెళ్లే అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్