బొంరస్ పేట మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీఓ మహేష్ కుమార్, దుద్యాల పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, తుంకిమెట్ల కరోబార్ తిరుపతయ్య, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సైఫ్ కు గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.