పూడూర్ మండలం కంకల్ లో శ్రీ వీరభద్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వివేకానంద స్వామి విగ్రహం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఆత్మీయ అతిథి భాస్కర్ రెడ్డి, విశిష్ట అతిథి రఘునాథ్, విగ్రహ దాత శైలజ నాగేశ్వరరావు, వీరభద్ర యువజన సంఘం అధ్యక్షులు రఘునాథ్ చారి, సంతోశ్, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ఉద్యోగులు, యువకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.