ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. శనివారం కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం మోమినాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆకతాయిలు మహిళలను, విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.