రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు కొడంగల్ పట్టణంలోని ముఖ్యమంత్రి నివాసంలో యూత్ కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.