సీఎం ఇలాకాలో రూ. 416. 54 కోట్లతో ప్రణాళిక సిద్ధం!
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అందరి దృష్టి కొడంగల్ నియోజకవర్గం వైపు మళ్లింది. సీఎం కోస్గిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 9 సెక్టార్లు, 21 ప్రాజెక్టులతో సీఎం సూచనతో హైదరాబాద్ కు చెందిన కన్సల్టెన్సీ రూ. 416. 54 కోట్లతో కోస్గి పట్టణ బృహత్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే కడా ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ లు నివేదిక పరిశీలించారు. ప్రభుత్వ ఆమోదం వచ్చాక పనులు జరగనున్నాయి.