గ్రామాల్లో చేపట్టిన అనేక అభివృద్ధి పనుల బిల్లులు చెల్లింపులు చేయాలని కోరుతూ సచివాలయం ముందు చేపట్టే నిరసన కార్యక్రమానికి శుక్రవారం బయలు దేరుతున్న మాజీ సర్పంచులను వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, గ్రామాలలో సర్పంచులు అప్పులు తెచ్చి బాధ్యతగా అభివృద్ధికి కృషి చేశారని అన్నారు.