వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చాపల గూడెం గ్రామంలో శుక్రవారం మైలమ్మ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా భక్తులు బోనాలు ఎత్తుకొని వాడవాడ తిరుగుతూ దేవాలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లక్ష్మణ్, బిచ్చయ్య వెంకటయ్య , సాయప్ప, భీమయ్య, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.