కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ అన్నారు. బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలో భాజపా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థుల విజయానికి ఐక్యమత్యంగా కృషి చేయాలని తెలిపారు.