వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు వెంకట్ రాములు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కార్యకర్తలు 50 మంది మంగళవారం డీసీసీ ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.