కుల్కచర్ల మండలం ముజహిద్ పూర్ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్మీడియట్ లో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ జ్యోతి హేప్సిబా మంగళవారం తెలిపారు. విద్యార్థులు పాఠశాలలో నేరుగా లభించు ఆఫ్ లైన్ ఫారం నింపి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ పొందిన అమ్మాయిలకు హాస్టల్ వసతి కలదని తెలిపారు. రిజర్వేషన్ల ప్రకారం సీట్లను కేటాయిస్తామని జూన్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.