పరిగి పట్టణంలోని మినీస్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పరిగి నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ కమిటీల సమీక్ష సమావేశంలో అన్ని విభాగాల అధికారులతో డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరూ గ్రామాల్లో పేదరికంలో ఉన్నటువంటి వారిని గుర్తించి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు వచ్చేట్టు ఎంపిక చేయాలని తెలిపారు.