మహ్మదాబాద్ మండల పరిధిలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఒక్కో సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి బోధిస్తున్నారు. ఈ ప్రత్యేక తరగతుల్లో విద్యార్థుల సమస్యలను ఉపాధ్యాయులు పరిష్కరించి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అధిక మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుందని శనివారం ఉపాధ్యాయులు తెలిపారు.