ఆషాడమాసం చివరి రోజు బుధవారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో పల్లె గడ్డ మైసమ్మ బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ కొనసాగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ, దైవచింతలతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.