2025-26 ఖరీఫ్ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. 5 జూన్ 2025 నాటికి భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అర్హులుగా పేర్కొన్నారు. రైతు భరోసా అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ను సంబంధిత AEOలకు ఈనెల 20 వరకు అందించాలన్నారు. ఇది వరకే రైతు భరోసా పొందుతున్నవారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.