కొత్తగా ఉద్యోగాల్లో చేరిన హాస్టల్ వార్డెన్లు వీలైనంత త్వరగా విధులపై అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నూతనంగా ఎంపికైన ఎనిమిది మంది వసతిగృహ అధికారులకు వికారాబాద్ కలెక్టరేట్లోని తన చాంబర్లో విధులపై బుధవారం అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే దిశగా పనిచేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు.