ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నవ రాత్రులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంట్లోనే కాక, వీధుల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారు నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత శైలపుత్రిగా దర్శనిమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కట్టుపొంగలి, చవివిడి, వడపప్పు ప్రసాదంగా పెడతారు. 6వ రోజున వేడుకలు, పూజలు ప్రారంభమవుతాయి. తరువాతి మూడు రోజులలో దుర్గ, లక్ష్మి, సరస్వతి వివిధ రూపాలలో పూజిస్తారు.