తెలంగాణ స్టేట్ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కొడంగల్ లో మంగళవారం పర్యటించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి పట్టణంలోని జీసీపీఎస్ పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యావ్యవస్థ బలోపేతానికి కల్పించాల్సిన మౌలిక వసతుల గురించి వారు చర్చించారు. ఎంఈఓ రామ్ రెడ్డి, అబ్దుల్ హక్ ఉన్నారు.