దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని జై కొడుతున్నారని, ఢిల్లీలో బీజేపీ గెలుపే ఇందుకు నిదర్శనమని తాండూరు బీజేపీ నాయకులు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27ఏళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి రావడం పట్ల శనివారం తాండూరులో సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకున్నారు.