దౌల్తాబాద్ మండలం కేంద్రంలో బస్టాండ్ నుండి గుముడాల వెళ్లే మూల మలుపు దగ్గరలో గుంతలు ఏర్పడి రహదారి ప్రమాదకరంగా మారింది. గుంతలలో వర్షపు నీటితో నిండడంతో వాహనదారులకు రాత్రిపూట ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గుంతల మయంగా మారిన రోడ్డును బాగు చేయాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు.