కళాశాలకు వెళ్లే మైనర్ విద్యార్థులకు బైకులు, స్కూటీలు ఇవ్వరాదని వారి తల్లిదండ్రులకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. ఇటీవల వికారాబాద్ జిల్లా పూడూరులో జరిగిన ఆర్టీసీ బస్సు, బైకు ప్రమాదంను దృష్టిలో ఉంచుకుని శనివారం తాండూరు పట్టణంలో మైనర్లు బైకుల వాడకంపై తనిఖీలు నిర్వహించారు. 25 మోటారు సైకిళ్లను గుర్తించి పోలీస్టేషన్‌కు తరలించారు. తల్లిదండ్రులను పోలీస్టేషన్‌కు పిలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.