ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పౌష్టికాహార మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్న భోజన కమిటీ సభ్యులు భోజనం చేయాలని నిబంధన విధించడంతో వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం టేకులగడ్డ తండాకు చెందిన హెచ్ఎం గౌరారం గోపాల్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్న భోజన విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించి మెనూ ప్రకారం విద్యార్థులకు సరఫరా చేయాలని ఏజెన్సీ భాయిని ఆదేశించారు.