గండీడ్ మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రుసుంపల్లి, చిన్న వార్వాల్, పెద్దవార్వాల్, జక్లపల్లి, వెన్నచేడ్, లింగాయ పల్లి, పలు గ్రామాల్లో ఎడతెరపి లేకుండా గంట సేపు భారీ వర్షం కురిసింది. వర్షానికి విద్యుత్ స్తంబాలను ముట్టుకోవద్దని అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.