బడీడు పిల్లలను బడిలో చేర్పించి, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని న్యాయవాదులు బసవరాజ్, ఆనంద్, వెంకటయ్య, రమేశ్, మహేశ్ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కొడంగల్ కోర్టులో న్యాయ విజ్ఞాన సదస్సు ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. చిన్నారులను కార్మికులుగా మారిస్తే బాలల చట్టం ప్రకారం శిక్షించనున్నట్లు తెలిపారు.